వేసవిలో వచ్చే ముంజల పైన కానుగ ఆకుల్ని కప్పుతూ ఉంటారు. వేసవి ప్రారంభం లో కానుగ చెట్ల ఆకులు రాలి చిగురించిన ఆకుపచ్చని నిగారింపుతో ఉంటాయి. వాటి పైన ఒక మైనపు పూత ఉంటుంది. అందువల్లనే అవి ముంజెల్లోని తేమని పీల్చావు.ఆకుల వాసన వాటికి అంటాదు. చల్లని నీడ కోసం రోడ్లపక్కన పెంచే కానుగ ఆకు ఆరోగ్యానికి శ్రీ రామ రక్షా వంటిది అంటారు. దీని ఆకులు గింజలు ఆయుర్వేదం లో వాడతారు. దగ్గు,డయేరియా వంటి సమస్యలకు కానుగ ఆకుల కషాయం ఇస్తారు. కానుగ పుల్లలతో పళ్ళు తోముకుంటే రుచి గ్రంధులు బాగా పనిచేస్తాయి. చర్మ సమస్యలకు కానుగ గింజల నూనె మందు లాంటిదే. రోడ్డు వారగా కానుగ మొక్కలు పెంచండి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

Leave a comment