‘ హల్లి మనే రొట్టి ‘ మంగళూరులో చాలా ఫెమస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఈ సెంటర్ ను నడిపే శిల్ప జీవితాన్ని ఇప్పుడు యూత్ పాఠాలుగా వింటున్నారు. 2009 వరకు భర్తతో హాయిగా జీవించిన శిల్ప ఉన్నట్లుండి అతను మాయం అవటంతో తల్లితండ్రులు,తమ్ముడు తన కన్నబిడ్డను బతికించు కొనేందుకు మొబైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేసింది. సాంప్రదాయ కన్నడ రుచి తో ఉండే ఈ భోజనానికి ఉద్యోగులు ప్రధానమైన కష్టమర్లు . మౌత్ పబ్లిసిటీ తోనే ఈ హల్లె మనే రొట్టి ఫుడ్ ట్రక్ మహీంద్రా గ్రూప్ నిర్వాహకులు ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చింది. ఆమెకు మహీంద్రా గ్రూప్ నుంచి బోలెరో మ్యాక్సీ ట్రక్ ప్లస్ బహుమతిగా అందింది. శిల్ప ఫుడ్ సెంటర్ ఇప్పుడు ఆమెకు రోజుకు ఐదువేల రూపాయలు ఆదాయం ఇస్తోంది.

Leave a comment