వర్షాల్లో జుట్టూ మాటి మాటికీ తడుస్తూ, వెంటవెంటనే తలస్నానం చేయవలసి రావటం వల్ల జుట్టూ పొడిబారటం, రాలి పోవటం జరుగుతుంది. అంపాత చల్లగా ఉన్నా వర్షాలు పడుతున్నా జుట్టుకు నూనె పట్టించడం మంచిదే. దీనివల్ల జుట్టుకు రక్షణ ఇచ్చినట్లవుతుంది. అయితే నూనెను కేవలం రెండు మూడు గంటల్లో కడిగేయాలి. ఆలివ్ లేదా నువ్వులు నూనెలు స్నానానికి రెండు మూడు గంటల ముందుగా మసాజ్ చేసుకొంటే కుదుళ్ళు, మాడుకు పోషకాలు లబిస్తాయి. వాష్ చేసాక తప్పని సరిగా కండిషనర్ వాడాలి. ఇది శిరోజాల పరిరక్షణకు మెయింట్నెన్స్ కు పనికి వస్తుంది. డెయిలీ వాడేందుకు తేలికపాటి హాల్ట్ గుణం, యాంటిహ్యుమిడిటీ గల క్రీమ్ లు సెరమ్ లు వాడాలి. ఈ సీజన్ లో స్టైలింగ్ కు దూరం గా ఉంటె మంచిది.

Leave a comment