వెలుతురుగా వుండే కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటల తరబడి పని చేస్తూ వుంటే కల్లు చాలా అలసట చెందుతాయి. కంటి ఆరోగ్యం బావుండాలంటే ముందర మంచి  ఆహారం గురించి ఆలోచించాలి. కెరోటినాయిడ్స్ ద్వారా ముఖ్యంగా లూటెయిన్, జాక్సాంటిన్ ల ద్వారా కళ్ళను పరీక్షించుకోవచ్చు. ఇవి వృక్ష ఆధారిత పదార్ధాలు. ఈ రెండు పోహకాలు కళ్ళను సంరక్షిస్తాయి. వయస్సుకు సంబందించిన డీజనరేషన్, కేటరాక్షుల నుంచి కళ్ళను రక్షిస్తాయి. టొమాటోలు, క్యారేట్, మొక్కజొన్న, పుచ్చకాయ, బటానీలు, చిలకడ దుంపలు, గుమ్మడి, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు వంటి పదార్ధాల్లో లూటెయిన్ సమృద్దిగా పసుపు రంగు గలవాతిలో మొక్క జొన్నలో అధికంగా దొరుకుతుంది. ఇలాంటివాన్ని కళ్ళకు మేలు చేసేవే.

Leave a comment