చల్లగా ఉందికదా నీళ్లు తాగటం మానేస్తే చాలా సమస్యలోస్తాయి అంటున్నారు డాక్టర్లు. శరీరం డీ హైడ్రేషన్ కు గురి కావచ్చు. అలాగే భోజనం తరువాత సరిగా నీళ్ళు తాగకపోయినా ఆహారం జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం ఎదురవ్వచ్చు. కిడ్నిల పని తీరుకూడా దెబ్బతింటుంది. ఈ చలిని వాతావరణంలో ఉత్తేజం తెచ్చుకోవటం కోసం కప్పు కాఫీనో టీనో తాగాలి అనుకొంటారు. కానీ వాటి బదులు కూడా కావలసినన్ని నీళ్లు తాగితే శరీరంలో ఏర్పడే డీహైడ్రేషన్ తాలుకూ గందరగోళం తగ్గుతుంది. అలాగే మనలో ఉలిగే ఆందోళన,ఒళ్లు నొప్పులు , తలనొప్పి కి కూడా తగినన్ని నీళ్ళు అందక పోవటం కారణం కావచ్చు. శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోకుండా ఉండేందుకు నీళ్ళు తప్పని సరి తాగాలి.

Leave a comment