Categories
తెల్లగా మిలమిలలాడే పళ్లు ముచ్చటగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. పళ్లపై పసుపు రంగు మరకలు రావడం మామూలే. ఈ పసుపురంగు వదలాలంటే నెలలో ఒకసారైనా బేకింగ్ సోడా, నీరు కలిపి పేస్ట్‌గా చేసి దాంతో బ్రెష్ చేసుకోవాలి. ఇది మరకల్ని తొలగించే చిట్కా. ఎనామిల్‌కు ఎలాంటి హానీ కలగదు. అయితే తరుచూనో, ప్రతీరోజూ ఇది కుదరదు. అలాగే యాపిల్స్, చెరుకు గడలు సహజంగా డిటాక్ట్ చేస్తాయి. ముఖ్యంగా కోలా, బ్లాక్ టీ, కాఫీ వంటివి పళ్లపై మరకలు పడేలా చేస్తాయి. అలాంటప్పుడు ఇవి తాగాక యాపిల్ ముక్క తింటే మంచిది. కానీ పళ్లపై పడ్డ మరకలు, గోళ్లు చిట్లి పోవడర , మరకలు పడడం అనారోగ్యాలకు సూచన. ఇలా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించడం మానొద్దు.