ఎంత శారీరక శ్రమ చేస్తే అంత లాభం అంటున్నారు పరిశోధకులు. ఇక్కడ పని అంటే ఆఫీసులో పని అనుకుంటే, అవసరమైన ఆఫీసు పని కంటే కూడా ఇంకా ఓవర్ టైం ఇంకో రెండు గంటలు పని చేసినా పర్లేదు. అస్సలు బోలెడన్ని అనారోగ్యాలు రావంతున్నారు. పరిశోధకులు కొందరు ఉద్యోగుల పైన పరిశోధన నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులగా విడ తీసి మధ్యలో కొంత సేపు విరామం, పనిలో కొంత సేపు అంతరాయం ఇస్తూ ఎక్కువ గంటలు పనిచేయించారు. మరో గ్రూపుకు పని గంటలు అవ్వగానే వదిలేసారు. కొన్ని నెలల తర్వాత వీరి ఆరోగ్య పరిస్తితి పరిశీలిస్తే కొద్ది పాటి విరామం తో ఎక్కువ పని గంటలు పని చేసే వాళ్ళు 5.5 కిలోల బరువు తగ్గారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణ స్థాయి లో వుంది. రెండో గ్రూపులో ఇవేమీ లేవు. డయాబెటిస్ కు దరి తీసే అధిక బరువు, రక్తంలో గ్లుకోజ్ స్థాయి గతంలో వునట్ట్లే వున్నాయి. రిపోర్ట్ ప్రకారం ఎక్కువ పని చేస్తేనే టైమ్ టు డయాబెటిస్ ముప్పు తప్పించుకోవచ్చు అని రుజువైంది.

Leave a comment