ఈ రోజు రాఖీ పౌర్ణమి లోకంలో సోదరీ సోదర సంబంధాలు చక్కగా  వుండాలని చెప్పే సూత్ర బంధం ఇది శ్రవణ పూర్ణిమ రోజు చిన్నవాళ్ళు తమకి ఎవరిపైనా గురి వుందో ఆ పెద్దల చేతికి రాఖీ కత్తి ఆశీస్సులు పొందుతారు. మార్గదర్శకునిగా వుంటూ నా రక్షణ బాధ్యతలను చుసుకోవని హృదయ పూర్వకమైన  అభిప్రాయంతో కట్టు బడే పవిత్ర సూత్రం ఇది అందుకే ఇది సూత్రం కూడా. బలిచక్రవర్తి తన రక్షకుడిగా భావిస్తూఅతని సోదరి అతని చేతికి రక్షగా సూత్రాన్ని కత్తి ఆశీర్వచనాన్ని పొందితే. యముని చేతికి అతని సోదరి యామి కుడా ఈ రక్షా సూత్రాన్ని కత్తి ఆశీర్వాదం పొందింది. ఇది సోదర సోదరీ బాంధవ్యాన్ని తెలియజెప్పే రక్షాబంధనం. ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా ప్రతి చెల్లెలు అన్న గారికి రాఖీని కట్టి ఆశీర్వాదం తీసుకోవాలి.

Leave a comment