
వాకింగ్లు , ఎక్సర్సైజులు లైదా కదలకుండా కూర్చోవడం తర్వాత కీళ్ల నొప్పులు వేధించడం మొదలుపెడతాయి . ప్రతీ చిన్న మందులు అవసరం లేదు . ఇంట్లో ఈ చిన్నపాటి సేవలు చేస్తే చాలు పాదాల నొప్పులు పోతాయి . చక్కగా తయారవుతాయి కూడా . అరబకెట్ నీళ్లలో కొన్ని ఐస్ ముక్కలు వేసి కాళ్లకు ఆ చల్లని నీళ్లలో ముంచి ఉంచితే నొప్పులు వాపులూ పోతాయి . పూర్తిగా ఆ చల్లదనం భరిస్తూ అరగంట తీస్తూ ముంచుతూ రావాలి .అలాగే చిన్న టబ్‌లో యాపిల్ సిరార్ వెనిగర్ ,కొద్దిగా విప్సం సాల్ట్ వేసి పాదాలు అందులో ఉంచినా వాపు నొప్పులు తగ్గుతాయి . అలాగే పసుపు రాయడం మంచి చికిత్స .పాదాలకు ఆరోగ్యం కూడా .ప్రతీ రోజూ పసుపును రాసినా నీళ్లలో కలపి ఆ ఉన్న మిశ్రమాన్ని కాళ్లకు రాసుకుని ఆరాక ఇబ్బంది గా ఉంటే కడిగేయవచ్చు . లేదా అలా వుంచుకున్న బాగుంటుంది . పసుపు రాసిన పాదాలు చాలా చక్కగా ఉంటాయి . పాదాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి నొప్పులు మంట తగ్గి పోతాయి . పాదాలు కూడా చక్కగా నునుపు దేరుతాయి .