సంక్రాంతి స్పెషల్ పండగ ముగ్గులే. ఈ ముగ్గుల్లో గొప్ప సంకేతాలున్నాయి. కల్లాపి జల్లి శుబ్రం చేసి నెల ఆకాశమైతే ముగ్గుల్లో పెట్టే ప్రతి చుక్క నక్షత్రం. చుక్కల సమూహం తో కలిపిన ముగ్గులు ఒక్కో గ్రహ మండలానికి సంకేతం. ప్రతి ముగ్గు లోనూ మధ్యలో వుండే గది గ్రహ నాయకుడైన సూర్యుని సంకేతం. సాధారణంగా వాకిట్లో వేసే ఐదు చుక్కల ముగ్గు నిలువు ఐదు చుక్కలు, పక్కన ముడేసి, వాటి పక్కన ఒక్కో చుక్క పెట్టే ముగ్గు పంచ భూతాలు ఐదు, త్రిమూర్తుల ఆధీనంలో ఉంటాయని ఈ త్రిమూర్తులను నడిపించేది ఆడి శక్తి అని సంకేతం అని చెప్పుతున్నారు విజ్ఞులు. బియ్యం పిండి తో వేసే ఈ ముగ్గు ని సృష్టిలోని అతి చిన్న జీవులైన చీరులు కీటకాలకు ఆహారంగా ఇచ్చేందుకు సృస్తిన్చారట. సంకేతాలు ఎలా వున్నా జీవులకు ఆహారం ఇవ్వడం అనే ఆదర్శం బావుంది.
Categories