ఇప్పుడు సెంట్రల్ ఏసీ ఉండే ఆఫీసులే ఇంటికి రాగానే అలవాటు కొద్ది ఏసీ ఆన్ చేయడమో ఇలా 24 గంటలు ఏసీల్లో కంప్యూటర్స్ ముందే ఉండేవాళ్ళు సూర్యకాంతికి దూరమైపోతూ వాళ్ళలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతూ ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యానికి గురవుతున్నారు.ఎప్పుడు ఏసీ గదుల్లో ఉండటం వల్ల బ్యాక్టీరియా ,వైరస్ విస్తరిస్తాయి. ఉదయాన్నే ఏసీ ఆన్ చేసే ముందర కనీసం ఒక గంట పాటైన తలుపులు కిటికిలు తీసి ఉంచితే గదిలోని ఫంగస్ బయటకి పోతుంది. అలాగే నిరంతరం ఏసీల్లో ఉండేవాళ్ళు సూర్య కిరణాలు శరీరానికి సోకే విధంగా కాస్త బయట గడిపితే మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment