చెత్త ఏరుకొనే వాళ్ళ జీవితాలను మార్చేసి,వాళ్ళని ఉద్యోగులుగా వ్యాపార వేత్తలుగా చేసింది నళినీ శేఖర్. హసిరుదళ్ ఇన్నోవేషన్స్ ( గ్రీన్ పార్టీ) పేరుతొ ఆమె నెలకొల్పిన సంస్థ పది వేల మంది జీవితాలను మార్చేసింది. యూనివర్సిటీ చదువు పూర్తి చేసిన నళిని మహిళలకు స్వయం ఉపాధి పనులు నేర్పటానికి ఇష్టపడుతోంది. చెత్త ఏరుకొనే వారిని పర్యావరణ పరిరక్షకులు అని పిలుస్తూ లోక్ అదాలత్ తో మాట్లడి బెంగళూరు నగర పాలక సంస్థ చేత గుర్తింపు కార్డులు ఇప్పించింది ఇప్పుడు వారంతా యూనిఫారాలు,బూట్లు గ్లవ్స్ ధరించి తడి చెత్తను బయోగ్యాస్ కేంద్రాలకు,పొడి చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపుతున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరు ఈ పనులను విభజించుకొని చేస్తున్నారు. వారి పిల్లలు స్కూళ్ళకు వెళుతున్నారు. నళిని శేఖర్ చేపట్టిన హాసిరుదళ్ మోడల్ ను టాటా కంపెనీ జంషడ్ పూర్ లో అచ్చంగా అలాగే అమలు చేస్తున్నారు.