Categories
ఎన్నో నిరాశలు, వివాహ జీవితం దెబ్బతిన్నది తల్లిదండ్రులు, సోదరి మరణించారు నా పదేళ్ళ కొడుకును దృష్టిలో ఉంచుకొని మొదటిసారిగా డెలివరీ గర్ల్ గా జీవిత ప్రయాణం ప్రారంభించాను అంటుంది రూపా చౌదరి. ఆమె స్ఫూర్తితో ఇప్పుడు రెండు వేల మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్ కి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. స్విగ్గి ఫుడ్ డెలివరీ తర్వాత ఫిబ్రవరి లో మొదటి బైక్ టాక్సీ డ్రైవర్ గా రూప చౌదరి పేరుపొందారు. కలకత్తా లో ఉండే రూపా చౌదరి ఇప్పుడు కొత్తగా మరో బైక్ టాక్సీ యాప్ లో డ్రైవర్ గా చేరింది. పోరాడి నిలబడగలగాను అనే ధైర్యం ఇస్తోంది ఈ జాబ్ అంటుంది రూపా చౌదరి.