తొలి తెలంగాణ షూటర్ గా పేరు తెచ్చుకోవడం, సంతోషాన్ని ఇచ్చింది. నా ధ్యేయం 2024 లో ప్యారీస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం దేశానికి మరిన్ని పతకాలు సాధించడం అదే నా కల… నా కృషి అందుకే అంటుంది హైదరాబాద్ కు చెందిన ఈశా సింగ్. గత సంవత్సరం ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణాలు, ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ లో రజతం గెలుచుకుంది ఈశా సింగ్. సీనియర్ ప్రపంచ కప్ లో రెండు స్వర్ణాలు ఒక రజతం సాధించింది ఈ మధ్యకాలంలో ఐ.ఎస్.ఎస్.ఎఫ్ సీనియర్ షూటింగ్ ప్రపంచకప్ లో 10 మీ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం గెలుచుకున్న ఈశా అత్యుత్తమంగా ఆడటం లక్ష్యం అంటోంది.

Leave a comment