ఇప్పుడు ఏ నగరంలోనైన షాపింగ్ మాల్స్ కనిస్తూనే ఉంటాయి. సాధారణంగా వాకింగ్ ను విసుగుతో పక్కన పెట్టే వాళ్ళను ఈ మాల్స్ కు వెళ్ళమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఊరికే ,షాపింగ్ చేయవద్దు. ఇక్కడి వాతావరణం నియంత్రణలో ఉంటుంది. భద్రతా సిబ్బంది ,కెమెరాలు, చుట్టు మనుషులు మిగత ప్రదేశం కంటే చాలా సురక్షితం .అనేక సౌకర్యాలు ఉంటాయి. నడిచే ఉపరితలాలు సురక్షింతంగా ఉంటాయి. ఒక వేళ అంతస్థుల మాల్స్ మెట్లు ఎక్కేందుకు అనేక అవకాశాలు ఇస్తాయి. అంచేత సరదాగా విండో షాపింగ్ చేస్తూ నడిస్తే అలసట అనిపించదు…అంచేత ప్రతి రోజూ ఏదో ఒక మాల్ లో పది రౌండ్స్ తిరగండి అదే చక్కని వాకింగ్ అంటున్నారు నిపుణులు .ఈ సలహా బావుంది కదా.

Leave a comment