పెద్దగా రకరకాల షాపుల్లో వుండే కళ్ళద్దాలు కంటికి రాక్షనే కాదు, స్టయిల్ అంతకుమించి ఫ్యాషన్ కూడా కళ్ళద్దాలు లేకపోతే ఫ్యాషన్ ని ఎలా ప్రొడ్యూస్ చెయ్యాలి అనుకునేంతగా ఇది మహిళల జీవితం లో అంతర్భాగంగా అయిపోతున్నాయి. ఇప్పుడు వేసవిలో కళ్ళకు రక్షణగా నిలిచే కళ్ళద్దాలు శీతాకాలం చిరు ఎండల్లో కూడా కళ్ళకి అందం స్టైల్ ఇస్తాయి. పాత తరం తారలు ఈ ఈ సన్గ్లాస్ అందాలని ప్రజల్లోకి తీసుకువస్తే ఇప్పటి తరం అమ్మాయిలు మచ్చలు కమ్మిన రోజున కూడా కళ్ళ జోళ్ళు తీస్తే ఎలా అని దిగులు పడిపోతారు. ఎందుకంటే ఇవి ఇవ్వాల్టి ఫ్యాషన్ స్టైల్ యాక్ససరీ. స్క్వేర్ ముఖాకృతి వుంటే నలుచదరపు ఫ్రేమ్స్ బాగుంటాయి. పొడవాటి మొహం కలవారికి క్వాట్స్ఐ బాగుంటుంది. మొత్తానికి కళ్ళజోళ్ళు సౌందర్య పోకడలో ఒక ముఖ్యమైన భాగం.

Leave a comment