నీహారిక,

యూత్ మనస్సులో ఏముందో తలుసా అన్నావు. తెలుసు ఇవాల్టి తరం అమ్మాయిల కల స్టార్టప్. కళాశాల చదువు అయ్యి అవ్వడం తోనే ఒక చెక్కని బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి. సక్సెస్ అవ్వాలి. కానీ ఆ స్టార్టప్స్ విజయవంతంగా నడిపించే లక్షణాలు డెవలప్ చేసుకో మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫస్ట్ స్టార్టప్ మొదలు పెట్టాలి అంటే అస్సలు మనలో వుండే సమర్ధతలేమిటి? మనమేంటి, ప్రత్యేకత లేమిటి తేల్చుకుంటే మనం తాయారు చేసే ఉత్పత్తిని మనదైన పద్దతిలో మార్కెట్ చేయడం సాధ్యం అవుతుంది. అలాగే పెద్ద సభల్లో ప్రేసంగాలు చేయక పోయినా పర్లేదు. మనతో కలిసి మాట్లాడే వాళ్ళతో ప్రతిబావంతంగా మాట్లాడగలగాలి. ఎప్పుడూ సానుకూలంగానే మాట్లాడాలి. ఎప్పుడూ నెగటివ్ సిగ్నల్స్ ఇవ్వకూడదు. అలాగే ఓటమిని తట్టుకోగల సమాధ్యం వుండాలి. ప్రతీదీ ప్రారంభంలోనే రెండో వారంలో రిజల్ట్ చూడాలి అనుకుంటే కష్టం. వంద సార్లు నష్టం వచ్చినా నేనా నష్టాన్ని భరించి లాభాల బాటలో పట్టించగలను అనే నమ్మకం వ్యాపారంలో సక్సెస్ కు పునాది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అమ్మాయిల కళలు నిజాం కావాలి అంటే కొన్ని నైపుణ్యాలు అలవర్చు కోవడమే. ఇప్పుడు చెప్పు, యూత్ మనస్సులో కోరిక గెలవడం అంకుర పరిశ్రమలకు ఎంటో ప్రోత్సాహం వుంది. రెండు చేతులతో వాటిని అందుకోవాలి.

Leave a comment