అచ్చం వజ్రాల లాగే కనిపించే అమెరికన్ డైమండ్ భూమి నుంచి తవ్వి తీసిన అసలు వజ్రాలు వంటివి కాదు ఈ కృత్రిమ వజ్రాలు ప్రయోగశాలలో తయారవుతాయి వజ్రపు పొడిని కరిగించిన గ్రాఫైట్ కార్బన్ తో కలిపి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర తీవ్ర వత్తిడికి గురి చేసి స్పటికాల్లాగా చేస్తారు.  తర్వాత దాన్ని మాములు వజ్రం లగే కట్ చేసి పాలిష్ చేస్తారు. జెమాలజిస్ట్ లు కూడా ప్రత్యేక పరికరాలు సాయం లేకపోతే ఏది నిజమైన వజ్రమో ఏది తయారు చేసిన వజ్రమో తెలుసుకోలేకపోతారు. ఈ లాబ్ డైమండ్స్ తో నెక్లెస్ లు, పెండెంట్లు, ఉంగరాలు, బ్రాస్ లైట్లు, గాజులు, చెవి దిద్దులు ఇలా మామూలు వజ్రాలతో ఏవేం నగలు చేస్తారో అన్ని చేయొచ్చు. 20 నుంచి 26 వేల లోపే ఈ డైమండ్స్ ఖరీదు ఉంటుంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల క్యారెట్ల వజ్రాలు అమ్ముడవుతున్నాయి జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్సపోర్ట్  ప్రమోషన్ కౌన్సిల్ లెక్క ప్రకారం మన దేశంలో 2019లో దాదాపు మూడువేల కోట్లు విలువ చేసే వజ్రాలు ఎగుమతి చేస్తే  2020 నాటికి 74 శాతం ఎగుమతులు పెరిగాయి వజ్రాలను ఎన్నో రంగుల్లో తయారు చేస్తోంది. స్వరోవిస్కీ బ్రాండ్ ఖరీదు తగ్గేసరికి వజ్రాలు వాడకం పెరిగింది మనదేశంతో పాటు, స్విజర్లాండ్, అమెరికా, చైనాలో కూడా స్వరోవిస్కీ కంపెనీ వజ్రాలు తయారవుతున్నాయి నగల చూస్తే అసలైన వజ్రాలు లేవో,నకిలీవేవో తెలియకుండా ఉంటాయి.

Leave a comment