అందంగా ఆకర్షణీయంగా తయారయ్యేందుకు రక రకాలుగా  ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే ఎప్పుడు ఏం చేయాలో కూడా ఒక పద్ధతిగా ఉండాలి కొన్ని పనులు రాత్రివేళల్లో కొన్ని ఉదయం పూట చేయాలి ఉదాహరణకు మొహం పై మృతకణాలను తొలగించే పని ఉదయమే చేయాలి .కంటికి వేసిన మేకప్ ని తొలగించేందుకు వాడే ఆయిల్ ఫ్రీ మేకప్ రిమూవర్ ని రాత్రివేళ నే ఉపయోగించాలి మొటిమలు తొలగించే యాక్నేవాష్ కూడా రాత్రి వేళనే చేయాలి .ఇవి వాడాక  కందిన  చర్మం లేదా ఎర్రబడిన చర్మం సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం తీసుకుంటూ ఉంటుంది . మృతకణాలను తొలగించే స్క్రబ్ అస్తమానం వాడకూడదు.వారానికి ఒక్క రోజే వాడాలి. క్లెన్సర్ లు వారానికి రెండు సార్లే.ప్రతి రోజు స్క్రబ్ తో రుద్దితే ముఖచర్మం కందిపోతుంది.

Leave a comment