చాలా మందికి అక్వేరియంలో చేపలు పెంచటం చాలా ఇష్టం . గాజుపెట్టిలో నీటిముక్కలు ,చక్కని రాళ్ళు . ఈదే బంగారు రంగు చేపలు ఇంటికే అందం ఇచ్చేవి . ఇప్పుడు ఆ రూపం మార్చేశారు డిజైనర్లు . ఒకే దాన్లో రెండు మూడు ఉపయోగాలు ఉంటున్నాయి . డిజైనర్ గ్లాస్ బౌల్  అక్వేరియం లు వచ్చాయి . టెర్రికోట,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ,కాపర్ వంటి పదార్దాలతో కళాత్మక మైన డిజైన్లు వచ్చాయి . పచ్చని గాజు తొట్టె ఒక అందమైన చేప ఆకారంలోనే ఉంటుంది . ఐ,ఇంకో అందమైన మెర్మెయిడ్ హాయిగా పడుకొని ఉంటే ఆమె వీపు పైన అందమైన  అక్వేరియం ఉంటుంది . ఏనుగులు చేపల దాహం తీరుస్తూ ఉంటుంది . ఇలాటి కళాత్మకమైన వస్తువులే ఇప్పటి  అక్వేరియంలో ఇంటి అలంకరణలో ముఖ్యమైనవి ఇవే .

Leave a comment