జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. జీవిత ప్రారంభంలో అయినా ,రిటైర్మెంట్ లో అయినా ఉన్నన్నీ రోజుల ఏదో ఒక వ్యాపకం కల్పించుకోవాలి. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అంటున్నారు సీనియర్ నటి జయసుధ. ఒక ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ గత 47 సంవత్సరాల నుంచి గ్యాప్ లేకుండా నటిస్తున్న. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి. నాకు నచ్చింది చీరెల డిజైనింగ్ . చీరెల ఎగ్జిబిషన్స్ పెట్టడం నాకు చాలా ఇష్టం . పన్నెండేళ్ళ క్రితం నేను సేకరించిన చీరెలతో ‘జె 8 బై జయసుధ కపూర్’ పేరుతో ఎగ్జిబిషన్ పెట్టాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి వీటి తోనే నన్ను నేను డైవర్ట్ చేసుకోవటం కోసమే నేను ఇలాంటివన్ని చేస్తుంటా అన్నారు జయసుధ. ఆమె సరదాగా మొదలుపెట్టి ఇప్పుడు ఎగ్జిబిషన్స్ వరకు ఆ హోదాను తీసుకొచ్చారు.

Leave a comment