చేతులకే ఎక్కువగా పని చెప్తాము. అస్తమానం తడి తగులుతూనే ఉంటుంది కనుక చర్మం కాస్త రఫ్ గా తయారవుతుంది. గాఢత ఎక్కువగా ఉండే రసాయనాలు ఉన్న షాంపూలు, సబ్బులు వాడతారు కనుక చర్మం త్వరగా ముడతలు పడుతుంది. మొహంతో పాటు చేతులపై కూడా శ్రద్ద పెట్టాలి.  బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రిన్ రాయాలి.  స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కుదిరితే పొడి భారకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి రాస్తూ ఉండాలి. రాత్రి వేల కొబ్బరి, ఆలీవ్, భాదం ఇలా ఏదో ఒక నూనెతో మర్దన చేసుకోవాలి. ఒక్కో చెంచా చొప్పున పంచదార,ఉప్పు,తెనె కలిపి చేతులకు రాసి నెమ్మదిగా మర్దన చేస్తే మృత కణాలు పోయి చర్మానికి చక్కగా రక్త ప్రసరణ అంది హుషారుగా తయారవుతారు.కీరదోస,గ్లిజరిన్ కలిపి రాసినా ముడతలు పడకుండా ఉంటాయి.

Leave a comment