ఫెస్ బుక్ ట్విట్టర్ షేర్ చేసే ప్రతి విషయానికి లైక్లు షేర్లు కావాలనుకుంటారు. కానీ ఇందులో పాటించవలిసిన కనీస మర్యాదలున్నాయి. ఎలాగంటే ఇప్పుడు ఫెస్ బుక్ వాట్సాప్ లో కాంజి మంచి మెస్సేజ్ లు . ఫోటోలు సుభాషితాలు హాస్యాలు వస్తాయి. అవి బాగుంటే ఇతరులతో పంచుకోవాలంటే అవి ఎక్కడ నుంచి ఎవరు పంపారో కనీసం కోట్ చేయాలి . ఇది కనీస మర్యాద . లేకపోతే అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలిసిన వాళ్లకు ఎంతో చులకన భావం ఏర్పడుతుంది. ఎవరు పంపారో చెప్పినందువల్ల మనకి వచ్చే నష్టం కూడా లేదు . ఇక హ్యాష్ టాగ్ లో ప్రతి చిన్న విషయాన్నీ ట్యాగ్ చేసారు. బోర్ గా ఉందనీ ఇడ్లీ బాలేదని బస్సు లెటనో ఇలాంటివి కూడా హ్యాష్ ట్యాగ్ ని జోడిస్తే అభాసుపాలవటం తప్ప గొప్పేముంది. అలాగే ఎన్నో చోట్లకి వెళతాం దారిలో భోజనాలు చేస్తాం . ప్రతి నిమిషం ఆ ఫొటోలన్నీ పోస్ట్ చేస్తే ఇతరులకేం సరదా లాభం ? పైగా విసుగ్గా కూడా ఉంటుంది. మన మనస్సు ఉప్పొంగేవి మంచి పుస్తకాల గురించి తప్పనిసరిగా చూడవలిసిన సినిమా ప్లేసెస్ మనం మనస్ఫూర్తిగా సంతోషించి ఇతరులకు షేర్ చేస్తే వాళ్ళు ఈ ఆనందం షేర్ చెస్తరనిపించేవే పోస్ట్ చేస్తే బావుంటుంది. అమ్మాయిల భద్రత రీత్యా కూడా ప్రతి నిమిషాన్ని అర్ధం లేని ప్రతి ఫోటోని పోస్ట్ చేయటం ప్రమాదం కూడా.
Categories