Categories
Soyagam

చర్మ సౌందర్యానికీ, కేశ సంరక్షణకూ!

ఆరోగ్యం కోసం ఆల్మండ్స్ తినమని ఎప్పటినుంచో సిఫార్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాదం నూనె కూడా బహుళ ప్రయోజనకారి అని చెపుతున్నాయి పరిశోధనలు. ఆల్మండ్ ఆయిల్ చర్మ సౌన్దార్యానికి, కేశ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనె తీపి, చేదు రెండు రకాలుగా దొరుకుతుంది. బ్యూటీ ప్రొడక్ట్స్ లో తీపి నూనె విరివిగా ఉపయోగిస్తారు. ఆల్మండ్ ఆయిల్ లో ఉండే ఎ, బి, ఇ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ నూనెతో మర్దన చేస్తే పొడిబారిన చర్మానికి కొత్త కాంతి వస్తుంది. కళ్ళ కింది నల్లని వలయాలను కూడా ఆల్మండ్ ఆయిల్ నివారించాగలదు. కంటి కింది భాగంలో నల్లబడ్డ చోట ఆయిల్ తో మర్దన చేయాలి. ఈ ఆల్మండ్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్. పొడిబారిన చర్మపోషణ కోసం, చర్మానికి మంచి రంగు ఇవ్వడం కోసం ఈ ఆయిల్ దివ్యౌషధం అనవచ్చు. చర్మానికి సంభందించిన అలర్జీల కోసం ఆల్మండ్ ఆయిల్ లో లావెండర్ ఆయిల్, విటమిన్ ఇ ఆయిల్ కలిపి అప్లయ్ చేస్తే చాలా ఉన్న చర్మం పైని మరకలు కూడా మాయమవుతాయి.

Leave a comment