వేసవిలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. పగటి వేళల్లో మైల్డ్ క్లెన్సర్ తో రోజుకో నలుగు సార్లు అయిన ముఖం శుబ్రం చేసుకోవాలి. తలస్నానం చేసే ముందర జుట్టుకు నూనె రాయాలి. స్నానం చేసిన తర్వాత కండీషనర్ తప్పనిసరిగా రాయాలి. ఇంట్లో చేసిన ఫేస్ ఫ్యాక్ లు వాడటం ఉత్తమం. పెరుగు, గంధం, టొమాటో జ్యూస్, కలబంద గుజ్జు కలిపిన ఫ్యాక్ ముఖానికి వేయాలి. ఎండలోకి వెళ్ళే సమయం లో సన్ స్క్రీన్ లోషన్, వెట్ లిప్స్, లిప్ బామ్ వెంట తీసుకుపోవాలి. పెదాల తడి ఆరిపోకుండా లిప్ బామ్ ఉపయోగించాలి. నాలుగు గంటలకోసారి సన్ స్క్రీన్ లోషన్ రాయాలి. వీలైనన్ని సార్లు మొహం చల్ల నీటి తో కడుక్కోవాలి. అలాగే ఇంట్లోనుంచి తప్పనిసరిగా మంచి నీళ్ళు, పళ్ళరసం, పండ్ల సలాడ్ వెంట తీసుకు పోవడం చాలా మంచిది. ఈ వేసవి సమయంలో బయట ఆహారం తప్పని సారి అయితే కానీ తీసుకోవద్దు. నూనెలు, నూనె పదార్ధాలు, వేపుళ్ళు ఈ రెండు నెలలు పూర్తిగా మానేయడం మంచిది. సెనగ పిండిలో పెరుగు అరచెక్క నిమ్మరసం కలిపి ఈ బ్లీచ్ ను మొహానికి అప్లై చేసి పది నిమిషాల్లో కడిగేస్తే నల్లబడిన చర్మం యదా స్ధితికి వస్తుంది.
Categories