బిజీ లైఫ్ వల్లే మహిళలు వత్తిడి ని గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంట్లో పని ఒత్తిడి,కెరీర్ ఒత్తిడి నుంచి మానసికంగా స్ట్రాంగ్ అయ్యేందుకు రెండు నెలలకో చిన్న బ్రేక్ తీసుకుని ఏదైనా ప్రయాణం చేయాలి. కొత్త ప్రదేశం ఆటోమేటిక్ గా ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిదీ అనుకొన్న టైమ్ టేబుల్ ప్రకారం చేసి తీరాలనే భారం వదిలేయాలి. ప్రతిదీ అనుకున్న సమయం లోనే పూర్తి అవుతుందన్న గ్యారంటీ ఉండదు. లక్ష్యాలు మార్చుకుంటూ ఉండొచ్చు. ఐరన్, క్యాల్షియం ఉండే ఆహారం తీసుకోవాలి. నిద్ర చాలా సమస్యలకు పరిష్కారం హాయిగా నిద్రపోవాలి. వ్యాయామం లేని శరీరం బలహీనం అవుతుంది అందుకోసం వాకింగ్ చేయాలి. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకోవాలి శరీరం ఫిట్ గా ఉంటే వత్తిడి తగ్గుతుంది.

Leave a comment