Categories
Standard Post

అరటి కూరతోనూ ఎన్నో ఉపయోగాలు

అరటి పండ్లే కాదు పచ్చి అరటికాయలు  కూడా చాలా మేలు చేసే  కూరగాయ . విటమిన్‌ బి,సి అధికంగా లభించే వాటిలో ఇదీ ఒకటి . హిమోగ్లోబిన్‌ శాతాన్ని వృద్ధి చేసి  రక్తంలో చక్కెర  స్థాయిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది . రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఎన్నో ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది . బరువు తగ్గాలనుకొనే వాళ్లకి మేలు  చేస్తోంది . ఇందులో సమృద్ధిగా ఉండే  పీచు  వల్ల  త్వరగా  పొట్టనిండిన భావన కలుగుతుంది . అరటిలో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థను  పటిష్టం చేసి  రక్తాన్ని శుద్ధి చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది . ఇందులో గంజిగా ఉండే పదార్ధం చాలా ఎక్కువ . చక్కెర శాతం కూడా చాలా తక్కువ  రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి .ఇందులో లభించే ప్రొబయాటరీ  బాక్టీరియా ఆరోగ్యానికి మేలు చేస్తుంది . ఉదక సంబంధిత సమస్యలకు త్వరగా పరిస్కారం లభిస్తుంది . వేపుడు ,పులుసు, కూర గా ఎన్నో  రకాలుగా అరటికాయలను వండుకోవచ్చు .

Leave a comment