క్లీన్ గా అద్దంలాగా చుట్టు పరిసరాలు ఉంచుకునే వాళ్ళు మంచి టేస్ట్, మర్యాద వున్న వాళ్ళుగా మనం భావిస్తాం కదా, కానీ అంత నీట్ నెస్ లేకుండా టేబుళ్ళ నిండా చుట్టు కాగితాలు ఇతర వస్తువులతో గందర గోళంగా వుండే చోట పని చేసే వాళ్ళతో గొప్ప సృజనాత్మక, రిస్క్ తీసుకునే ధోరణి ఎక్కువగా ఉంటాయాని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఎంత నీట్ గా ఎంత చూడ ముచ్చటగా… అన్ని విషయలు పక్కన పెడితే కాస్త చిందర వందరగా వస్తువుల్ని ఉంచుకుని అక్కడే చదువుకుంటూ అక్కడే ఇతర పనులన్ని చేసుకునే యువతులు క్రియేటివ్ గా సారి కొత్త ఆలోచనలతో పనిలో నిమగ్నం అవ్వుతారట. వాళ్ళలో ఛారిటీ గుణాలు ఉంటాయట. విరాళాలు ఇచ్చే గుణం ఇతరుల కంటే ఎక్కువ వుంటుంది. చిందర వందరగా వున్న గదిలో హాయిగా పని చేసే వాళ్ళు అధిక ఆసక్తితో అదే ద్యాసగా కనిపిస్తారు. ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళు తాము చేసే పని విషయంలో పెట్టే శ్రద్ధ, ఇల్లు సర్దటంలో డెకోరేట్ చేయడంలో పెట్టారట. ఇల్లు కంఫర్టబుల్ గా వుంటే చాలనుకుంటారట. ఇవన్నీ బావున్నాయి కానీ ఇల్లు చిందర వందరగా వుంటే ముందు మనకే ఏ వస్తువు ఎక్కడ వుందో కనిపించద్దు!
Categories