నీహారికా,
పిల్లలు పెద్దయ్యాక వాళ్ళెంతటి వాల్లె అన్ని నేర్చుకుంటారు అనుకొంటారు కానీ వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే కొన్ని నైపుణ్యాలు పరిచయం చేయడం చాలా మంచిది. ఉదాహరణకు పిల్లలు వంట గదిలోకి వస్తే చాలు ఏం కావాలి, ఎందుకొచ్చావు పోయి చదువుకోమంటూ తల్లులు తరిమేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్లనే అటు ఏ పై చదువులకు వేరే ఊరులో వుంది చాడుకోవాల్సి వచ్చినా , లేదా పెళ్లి అయ్యిపోయినా, ఇటు అబ్బాయికీ, అమ్మాయికీ వంటే రాదు. అదేదో పెద్ద కష్టం అయిపోతుంది అందుకే పిల్లలకు హైస్కూల్ చదువులకు వచ్చాక వంటగది పరిచయం చేయడం బెస్ట్. కూరలు తరగడం, పాలు కచుకోవడం, ఏ కాఫీనో కలపడం, అన్నం వండటం, అమ్లేట్ వేయడం తో మొదలు పెడితే ఒక్కో ఆహారం రుచిగా శుచిగా వండుకోవడం నేర్పుకోవాలి. ఆహారం విలువ, వంట ఇంట్లో తల్లి పడే శ్రమ తెలియాలంటే ఇదే మార్గం. వంట కూడా ఒక జీవన నైపుణ్యం. గ్యాస్ పొయ్యి మిగతా ఎలెక్ట్రికల్ వస్తువులు, రోటీ మేకర్ లు, ఓవెన్ లు ఎలా వాడాలో జాగ్రత్తలు చెప్పి దగ్గరుండి అలవాటు చేస్తే చక్కగా నేర్చుకుంటారు. పెద్దవాళ్ళ గైడ్ లైన్స్ తో కమ్మని వంటలు వందేస్తారు. ఇవ్వాళ ఇలా నేర్పించుకొన్న వంట జీవితంతమ్ కమ్మని రుచి తో భోజనం చేసేందుకు మంచి మార్గం కదా.