చేతులు, మెడ పై వున్న చర్మం సాదరంగా సూర్యకిరణాలకు గురై కందిపోవడం, నల్లబడి పోవడం జరుగుతుంది. గాలి కాలుష్యం కూడా సూర్యకిరణాల మాదిరిగానే ఈ ప్రదేశంలోని చర్మానికి హాని కలిగిస్తాయి. సూర్యకిరణాలకు ఎక్కువ ఎక్స్ పోజ్ కావడం, అస్తమానం వేడికి తట్టుకోలేక నీళ్ళతో అదే పనిగా కడిగినా చేతులు, ఇతర భాగాలు సహజమైన నూనెలు కోల్పోతాయి పొడిగా అయిపోతూ ఉంటాయి. రెండో కారణం, సాదరంగా ముఖం పైన చూపెట్టిన శ్రద్ధ, మెడ పైన చేతులు పాదాల పైన చూపెట్టారు. క్రమం తప్పని హైడ్రేటింగ్ చికిత్సలు పీల్స్ అవసరం అవ్వుతాయి. మెడకు, చేతులకు, పాదాలకు మోచేతులకు కూడా హైడ్రేటింగ్ క్రీమ్స్ లోషన్స్ రాస్తుండాలి. సహజంగా హైడ్రేట్ చేయగల పద్దతులు అవలంభించాలి. మాయిశ్చురైజర్ పట్టి వుంటే పాక్స్ వేసుకోవాలి. స్నానం తర్వాత మాయిశ్చురైజింగ్ క్రీమ్ క్రమం తప్పకుండా శరీర భాగాలకు అప్లయ్ చేయాలి. శరీర భాగాలన్నింటి పైనా అధిక శ్రద్ధ చూపించాల్సిందే.
Categories