Categories
WoW

కొవ్వుని పసిగట్టే ముక్కు.

మన్యుషులకు వాసన పిల్చే సెన్సు చాలా ఎక్కువ. ఈ గుణం లో పదార్ధాల్లోని ఘుమఘుమల్ని ఆస్వాదించడమే కాకుండా ఆయా పదార్ధాల్లోని డైటరీ ఫ్యాట్ ని, అందులో కలిపిన ఎన్నో రుచుల్ని పసిగట్టగలరని అధ్యాయినాల రిపోర్ట్. ఈ మంచి లక్షణాలని ఉపయోగించుకుని సరైన భోజనం చేయమంటున్నారు డైటీషియన్లు. మనలోని ఈ గుణాలని మనం సరిగ్గా గుర్తించము ఒక వేళ గుర్తించినా పట్టించుకోము. ఫలానా పదార్ధలో ఫైబర్ ఎక్కువగా వుంటుందని ముక్కు చెప్పినప్పుడు దాన్నలా వదిలేయక ముక్కు చెప్పిన వస్తావాన్ని విశ్లేషించుకొగలగాలి. అలాగే పాలు, పాల పదార్ధాల లోని ఫ్యాట్ ను ముక్కు గుర్తించి , మెదడుకు తనకప్పటికే వున్న జ్ఞానం తో విశ్లేషిస్తుంది కూడా. చాలా ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ లోపలికి వెళుతుంది చూసుకోమని ఈ జ్ఞానాన్ని మనం నిర్లక్ష్యం చేసి తేరికగా అన్నీ తినేసి బాధపడతాం. ముందే ముక్కు వాసన చూసి పసిగట్టిన నిమిషం ఆ పదార్ధాన్ని పక్కన పెడితే పెద్ద నష్టం ఎమీ కాదు.

Leave a comment