ఏ దంగల్ సినిమానో, బాహుబలి సినిమానో చూసినప్పుడు హీరో, హీరోయిన్ లు కరక్ట్ ఫిట్నెస్ ప్లాన్ చేసారనిపిస్తుంది. అంటే పూర్తి శరీరాన్ని పరిగణలోకి తిసుకుని ఎక్సర్సైజులు చేయడం అన్నమాట. రన్నింగ్ లేదా బ్రిస్క్ వాక్ శరీరాన్ని కండీషన్ చేస్తాయి. క్యాలరీలు కరిగించి మేతబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. స్కిప్పింగ్, జుంపింగ్, జాక్స్ , స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ వంటి వార్మింగ్ ఎక్సర్సైజులు కొన్ని ఆసనాలు కండరాళ్ళకు టోనింగ్ ఇస్తాయి. జీర్ణ వ్యవస్థకు సహకరిస్తాయి. రోజు సూర్య నమస్కారాలు చేస్తే పూర్తి స్ధాయివ్యయామం శరీరానికి లభిస్తుంది. శరీరం కింద భాగం కోసం స్క్వాట్స్ లెగ్ కిక్స్ చేస్తుండాలి. సినీ దేవతలు ఇలాంటివి పర్ఫెక్ట్ ఫిట్నెస్ ట్రైయినర్లు పర్యవేక్షణలో చేస్తూ, ఆహారం విషయంలో అదుపు పాటిస్తే అందంగా ఉంటారు.

Leave a comment