రాబోయే వారంలో పది రోజులు ఇంకా ఎండలు ఎక్కువవ్వుతాయి అంటున్నారు. ఎయిర్ కూలర్లు. ఎ సిల విషయం అలా వుంచి, సహజంగా శరీరం కూల్ గా ఉండాలంటే మూడు పూటలా మజ్జిగే ఆధారం. పెరుగు బదులు చిక్కని మజ్జిగ చాలా బెస్ట్. కొబ్బరి నీళ్ళు తాటి ముంజులు, పుచ్చకాయలు కూడా చాలా చలువ చేస్తాయి. తాటి ముంజుల రసం ముఖంపై రాస్తే చమటకాయలు రావు. కర్భూజా జ్యూస్ తో ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. కీరా, బత్తాయి, ఆరంజ్ వంటివి ఏరూపంలో తీసుకున్నా శరీరానికి మేలు చేస్తాయి. ఇక మామిడిని మించినది ఈ సమ్మర్ సీజన్ లో ఇంకో పండు లేదు. జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లకు ఖనిజాలకు సరయిన ఆధారం. అలాగే పాలకూర హీట్ స్ట్రోక్ నుంచి కాపాడుతుంది. వీటన్నింటినీ ప్రయత్నించడం వల్ల వేసవిలో అత్యధిక ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ఈ సమ్మర్ ఫుడ్ ని వేసవి అంతా వడండి. ఈ సీజన్ హాయిగా ఆనందంగా గడిచిపోతుంది.
Categories