కుర్తీలు, చుడీదార్లు వేసుకుంటే ఆ డ్రెస్ డిజైన్లు మాత్రమే కాదు. అసలా దుస్తులు ఎలా వేసుకుంటే నప్పుతాయి అని ఆలోచించాలి. సాధారణంగా చక్కని రంగుల డిజైన్లు ఎంచుకుంటాం. కానీ శరీరం తీరుకూడా ద్రుష్టిలో వుంచుకోవాలి. కొందరికి చేతులు లావుగా ఉంటాయి అప్పుడు చేతుల్లేని కుర్తీలు ఎంచుకోవద్దు. అలాగే కాస్త బొద్దుగా వుండేవాళ్ళు మరీ బిగుతుగా వుండే కుర్తీలు వేసుకోవద్దు. బదులుగా కఫ్సాన్ తరహా లో వుండే టాప్స్, లెగ్గింగ్స్ ప్రయత్నిస్తే చూసేందుకు అందంగా వుంటుంది. కొందరికి నడుం కిన నుంచి లావుగా వుంటుంది. అలాంటప్పుడు మరీ పొట్టి కుర్తీలు వేసుకోకూడదు. అందువల్ల ఇంకా లావుగా కనిపించే ప్రమాదం వుంది. అప్పుడు పొడవుగా కుర్తీలు వేసుకోవాలి. ఇప్పుడు లేగ్గింగ్స్ ప్రింట్లు, లేసుల డిజైన్లు వస్తున్నాయి సాదా టాప్ వేసుకుంటే డిజైనర్ లేగ్గింగ్స్ వేసుకోవాలి. కుర్తీ మరీ సాదాగా ఉందనిపిస్తే కలర్ బెల్ట్, కుందన్లు, గుండీలు కుట్టినవి ఎంచుకోవచ్చు.

Leave a comment