Categories
ఉదయాన్నే మొట్టమొదటి రుచిచూసే తొలి పానీయం రోజంతా ప్రభావం చూపిస్తుంది అంటున్నాయి అధ్యయనాలు.గోరువెచ్చని నీళ్లలో సగం నిమ్మచెక్క పిండుకొని తాగితే రోజంతా తాజాగా చురుగ్గా ఉంటుంది.శరీరం హైడ్రేషన్ లో ఉండేందుకు జీవక్రియ సక్రమంగా సాగేందుకు నిమ్మ సహకరిస్తుంది.లివర్ ను క్లెన్స్ చేస్తోంది. నీరు శరీరం నుంచి విషతుల్యాలను వెలికి నెట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది రాత్రంతా మెంతులు నీళ్ళలో నానేసి ఉదయాన్నే వట్టి ఖాళీ కడుపుతో తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారికి కూడా మేలు చేసే పానీయం ఇది.