ఈ ప్రపంచంలో అతి పెద్ద ఇల్లు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది ‘కార్ల్‌ మార్క్స్‌ హాఫ్‌’ అనే నివాస సముదాయం. ప్రపంచంలో ఇదే అతి పెద్ద  కిలోమీటరు విస్తీర్ణంలో ఉండే ఈ ఇంటిని 1927లో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత చాలా మంది నివాసాలు లేవు. వారికి ఆశ్రయం కల్పించటం కోసం ఈ ఇల్లును కట్టుకుంటూపోయారు.పైకప్పు ఒక్కటే కానీ… లోపల మాత్రం గోడలతో వేరు చేస్తూ 1382 నివాసాలను నిర్మించారు.లోపల ట్రామ్‌ వాహనాలు ఆగేందుకు నాలుగు  స్టేషన్లు ఉన్నాయి. ప్రజలు వాటిలో ఎక్కి భవనం బయటికి వస్తారు. ఆసుపత్రి దగ్గర నుంచి స్కూలు వరకు సకల సదుపాయాలు ఉన్నాయి.12వ శతాబ్ధంలో ఈ భవనం కట్టిన చోట ఒక సరస్సు ఉండేదట. 

Leave a comment