Categories
చాలా స్నాక్స్ లో ఉల్లిపాయలు కలిపి తింటేనే రుచిగా ఉంటాయి. కానీ తిన్నాక నోరు వాసన వస్తుంది కనుక తినాలంటే ఇబ్బందిగా వుంటుంది. ఉల్లిపాయల్లో సల్ఫర్ గల వుత్పత్తులుంటాయి. సుల్ఫర్ వాసన ఊపిరి తిత్తుల్లోకి వెళుతుంది. కబట్టి దుర్వాసన వుంటుంది. ఉల్లిపాయలు తిన్నాక సోంపు, వక్కపొడి, కొత్తిమీర వంటివి సైడ్ డిష్ స్నాక్ తీసుకుంటే ఇవి సల్ఫర్ ఉత్పత్తుల్ని డైల్యూట్ చేస్తాయి. ఇవి చప్పరించడం వల్ల నోటిలోని లాలాజలం స్టిమ్యులేట్ అవుతుంది. లాలాజలం నోటి డిటర్జెంట్ లాంటిది. దీనిలో సహజమైన బైకార్బోనేట్ చేస్తుంది. మంచి నీరు తాగటం వల్ల కూడా ఇతర వాసనలు చాలా త్వరగా పోతాయి. షుగర్ లెస్ గమ్ చప్పరించినా ప్రయోజనం వుంటుంది.