కరివేపాకు వేస్తె వంటల్లో రుచి మారిపోతుంది. అదే వేపాకు సౌందర్య పోషణలో ఎంతో ఉపయోగ పడుతుంది. వేసవిలో వేడికి మొహం పైన గుల్లలు, నల్ల మచ్చలు వస్తాయి. గుప్పెడు కరివేపాకు మెత్తని పేస్టు గా చేసి అందులో కాస్త పసుపు వేస్తె మొటిమలు మచ్చలు తగ్గిపోతాయి. అలాగే కరివేపాకు మెత్తని గుజ్జుగా చేసి అందులో ముల్తానీ మట్టి చెంచాడు రోజ్ వాటర్ కలిపి దాన్ని మొహానికి అప్లయ్ చేస్తే ముఖం పైన నల్లని మచ్చలు, నల్లని వలయాలు పోతాయి. ముఖంలో తేడా తలిసిపోతుంది. కరివేపాకు గుజ్జుకు ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమం మెడకు ముఖానికి రాసి ఆరనివ్వాలి. ఇలా చేస్తే ముఖం పైన నలుపు విరిగిపోయి చర్మం మెరుపుతో వుంటుంది. కరివేపాకు గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే నల్లని మచ్చలు జాడ లేకుండా పోతాయి. ఈ ప్యాక్ తో మొటిమలు మచ్చలు కూడా పోతాయి. ఆ వేసవికి కరివేపాకు పాక్ వేస్తె ముఖం పైన మురికి మచ్చలు అన్నీ పోయి ముఖం తాజాగా కాంతిగా వుంటుంది.
Categories