ఆరెంజ్ రంగులో మెరుపులీనుతూ వుండే బొప్పాయిలో పోషకాలే కాదు. సౌందర్య కారకాలు కూడా వున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. మెరుపు లీనే చర్మం, ఆరోగ్యవంతమైన శిరోజాలు కోరుకునే మహిళలకు వరం బొప్పాయి. బొప్పాయి లోని విటమిన్-A  పైన ఎంజైమ్స్ మృతకణాలు తొలగించటానికి చర్మం మెరుపు లీనేందుకు సహకరిస్తాయి. బొప్పాయి గుజ్జు తేనె కలిపిన మాస్క్ తో మొహం మెరిసిపోతుంది. పచ్చి బొప్పాయి పేస్టులాగా చేసి మొహానికి రాస్తూ వుంటే మచ్చలు చాలా త్వరగా పోతాయి. బొప్పాయి గుజ్జు పాదాల పగుళ్ళు పోగొడుతుంది. వారంలో మూడు రోజులు బొప్పాయి తినగలిగితే జుట్టు రాలడం తగ్గుతుంది. బొప్పాయి సహజ కండీషనర్. బొప్పాయి, అరటి పండు, పెరుగు , కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట పాటు తలపై టవల్ చుట్టి ఉంచితే మాడుపైన వేడి పుడుతుంది. గోరు వెచ్చని నీళ్ళతో తలస్నాం చేస్తే జుట్టు మిలమిలలాడుతూ మెరిసిపోవడం తెలుస్తుంది.

Leave a comment