Categories
Top News

ఫ్యాషన్ వరల్డ్ లో క్లెయిన్ ముద్ర.

కాల్విన్ క్లెయిన్ డిజైన్స్ అన్నీ యంగర్ జనరేషన్స్ కు నచ్చి పోతాయి. ప్లెయిన్ డ్రెస్ లోనే సింపు కట్ తో ఒక క్లాసిక్ టచ్ ని మోడ్రన్ ఫిట్ ని వస్తాడు క్లెయిన్. అందుకే క్లెయిన్ డ్రెస్ లు ఏ కాలానికైనా సరిపోతాయి. క్లెయిన్ కట్స్ కి ప్రపంచం ఫిదా అయింది. జీన్స్ నుంచి, మిడ్ ప్రాక్స్, లాంగ్ ప్రాక్స్, ఇంకెన్నో ఫ్యాషన్ వెరైటీస్ ఇతని చేతిలోనే జీవం పోసుకున్నాయి. హాలీవుడ్ నటి ఏంజలీనా జొలీ, జెన్నిఫర్ లారెన్స్ లోవి ఫేమస్ సీరియల్స్ అన్నింటిలోను క్లెయిన్ డిజైనర్ డ్రస్సులే. ఇటివల న్యూయార్క్ ఫేషన్ షో ప్రింటెడ్ డ్రెస్ లు విడుదల చేసాడు క్లెయిన్. తేలికగా వుండే ఫ్యాబ్రిక్, ప్లాట్ కట్ తో వుండే ఈ డిజైనర్ డ్రెస్సులకు ఫ్యాషన్ వరల్డ్ స్వాగతం పలికింది.

Leave a comment