Categories
WhatsApp

బిడ్డ ఆరోగ్యం కోసం విటమిన్’డి’.

తల్లీ బిడ్డా ఆరోగ్యం గురించి ఎన్నో అధ్యాయినాలు జరుగుతుంటాయి. బిడ్డ ఆరోగ్యానికి తల్లి కడుపులోనే పునాది పడుతుంది. సాధారణంగా తల్లి, బిడ్డ  బావుండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. మంచి పోషకాహారం, వ్యాయామం తో బిడ్డ పుట్టాక ఎలాటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అయితే లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ అధ్యాయినం ప్రకారం బిడ్డ ఆరోగ్యం కోసం విటమిన్-డి మాత్రని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి లోపం రాకుండా తీసుకోవడం వల్ల బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి లోపం రాకుండా వుంటుంది. బాల్యంలో వచ్చే ఉబ్బసం, ఇతర శ్వాశ సంబందిత సమస్యలు రాకుండా ఉంటాయి. మూడో నెల నుంచి మొదలు పెట్టి విటమిన్-డి ని క్రమం తప్పకుండా రొజువారీ అవసరాలకు సరిపడేంతగా తీసుకోవాలని చెప్పుతున్నారు. ఈ డి-విటమిన్ మోతాదు గురించి రేగ్యులర్ చేకప్స్ కు వెళ్ళే డాక్టర్ ను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.

Leave a comment