నీహారికా,

లైఫ్ గోల్స్ సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్న పక్షంలో ముందు మనపై మనం పట్టు సాధించక పొతే జీవన గమనాన్ని సుతి మెత్తగా సాధించలేక, ఎదుర్కోలేక తీవ్రమైన వత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. మనస్సు శరీరం, అన్నీ  రకాల      మననుంచే ఆదేశాలు తీసుకుని నచ్చిన మేరకు పని చేస్తాయి. కనుక నియంత్రణ కావాలి. లైఫ్ లో చాలెంజింగ్ పరిస్తుతుల్ని ఎదుర్కొనే సందర్భంలో ఏ విధంగా వ్యవహరిమ్చాలన్నాపట్టు అవసరం. కొన్ని పరిస్థితుల్లో మనకు ఏ మాత్రం హెచ్చరిక లేకుండా వచ్చి పడతాయి. ఎలాంటి క్లూ వుండదు. ఆ నిమిషంలో ఎన్నో నిర్ణయాలుతీసుకోవాలి. ఆ విపత్తు ఎదుర్కోవాలి. అంటే కానీ దానికి దూరంగా పారి పోయి నిలబడ లేము కదా. ఏ పరిస్థితిలో నైనా మనకు నియంత్రణ వుంటే సమర్ధత పోగొట్టుకోకుండా నిలబడగలుగుతాము. ప్రతి నిమిషం ఎదురయ్యే సవాళ్ళను ఎప్పటికప్పుడు ఎదుర్కొనేందుకు తగిన మానసిక సంసిధత కావాలి. అది జీవితానికి , స్ధయిర్యానికి అత్యంత అవసరం.

Leave a comment