కొన్ని పాత్రలకు అనుష్కనే న్యాయం చేయగలదు. ఆమెకోసం ఆ పాత్ర అలా ఎదురుచూస్తున్నట్లు వుంటుంది. అలా వచ్చి ఆమె అందులో వదిగిపోతుంది. ఇంకోళ్ళని ఆ చోట చూడలేం అనిపిస్తుంది. ఇదంతా కొన్నేళ్ళ పాటు నటించడం వల్ల వచ్చిన నేర్పా అని అడిగితే అదోక్కటేనా ఇంకెన్నో కారణాలు అనేస్తుంది తేలికగా . మొదట్లో కొన్ని క్లిష్ట పాత్రల్ని వింటుంటేనే నేను చేయగలనా అని భయం, సందేహం వెంటాడేవి కానీ నటన నా వృత్తి. అప్పుడు నేను భయాలు వదలిపెట్టి అధ్యయనం మొదలు పెట్టాను. అది మంచి ఫలితం ఇచ్చింది. మనం నటించబోయే పాత్ర స్వభావం మనకు అర్ధం అయితే, మనకు అవగాహన వస్తే ఇంకా కష్టం ఏముంటుంది. నా శైలి మారిపోయింది. ప్రతి పాత్రను ప్రేమించడం మొదలుపెట్టాను. స్వతహాగా నాలో వున్న కష్టపడే తత్త్వం నా పాత్రలో పరిపుష్టంగా ఉండేలా చేస్తుంది. దానికి అనుభవం తోదవ్వుతుంది అని చెప్తుంది అనుష్క . త్వరలో ఆమె భాగమతి సినిమాలో తన విశ్వరూపం చుపించాబోతుంది.
Categories