ఒక్కసారి మొహం పైన వేసిన ఫౌండేషన్ అక్సిడైజ్ అయిపోయి. గ్రేగా మారిపోతుంది. మేకప్ ముందు చర్మాన్ని హైడ్రేట్ చేయక పొతే ఏరకం ఫౌండేషన్ అయినా సులభంగా అక్సిడైజ్ అయిపోతుంది. బేస్ అప్లయ్ చేసే ముందర తేలిక పాటి మాయిశ్చురైజర్ లేదా ప్రైమర్ అప్లయ్ చేయాలి. పింక్ లేదా వైట్ టోన్డ్ ఫౌండేషన్లు వాడకూడదు. పసుపు లేదా నారింజ టోన్స్ ఉపయోగించాలి. ఈ షేడ్స్ కరెక్టర్లు గా పనిచేస్తాయి. బేస్ కలర్ ను ఎక్కువ సేపు చెదిరిపోకుండా ఉంచుతాయి. కళ్ళ చుట్టూ ప్రదేశాల పై కన్సీలర్ అప్లయ్ చేయడం పైన ద్రుష్టి పెట్టాలి. బాగా బ్లెండ్ చేసి కాంపాక్ట్ తో ఫినిషింగ్ ఇవ్వాలి. ఈ కాంపాక్ట్ స్కిన్ కలర్ కు దగ్గరగా వుండాలి. కొన్ని మేకప్ టిప్స్ ఎక్స్ పర్ట్స్ దగ్గర నేర్చుకోగలిగితే సొంతంగా మేకప్ చేసుకోవడం ఈ జీనే. మంచి కంపెనీ క్రీమ్స్, ఫౌండేషన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెకట్స్ రావు .
Categories