నీహారికా, చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేస్తుంది. చదువులోంచి జాబ్ లోకి అడుగుపెడితే ఆ కొత్త వాతావరణంలో, హుందాగా, పద్ధతిగా క్రమశిక్షణలోకి రావాలంటే కష్టమే. మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుంటే అక్కడ ఇమిడిపోవడం సులభమే. ముందుగా సమయపాలన అలవర్చుకోవాలి. ఆఫీస్ టైమ్ కంటే పది నిముషాలు ముందే అక్కడ వుండేలా చూసుకోవాలి. అలాగే కొత్త వాతావరణంలో ఇమడటం సమయo తీసుకునే వ్యవహారం కాబట్టి ముందుగా చేయవలసిన పనులు నేర్చుకొంటూ ఆఫీసుకు అలవాటు పడాలి. ప్రతి పని నెమ్మదిగానే నేర్చుకోవచ్చు. అన్నీ వెంటనే తెలిసిపోవాలనీ కోరుకోవద్దు. ఏదైనా తెలియని విషయం వుంటే వెంటనే తెలుసుకోవడం, పొరపాటు చేసినా దాన్ని వెంటనే పై అధికారికి చెప్పి దాన్ని సవరించుకోవడం, ఆఫీస్ విషయాలను అర్ధం చేసుకుంటూ పనికే ప్రాధాన్యత ఇస్తే సరిపోతుంది. సందేహాలోస్తే సందేహ పడుతూ ఊరుకుంటే తర్వాత అడుగు వేసేందుకు వీలవదు. కనుక వెంటనే డౌట్ క్లియర్ చేసుకుంటూ, సిన్సియర్ గా ఉంటూ వృద్ధి లోకి రావచ్చు. ఎలాంటి సక్సెస్ లకైనా అడ్డదార్లు వుండవు. రాజమార్గం పనిచేయడమే. కష్టపడటం మాత్రమే.
Categories