నీహారికా,
ఇప్పుడున్న సమాజంలో సుఖజీవనం కోసం ఎన్నో రహదారులున్నాయి. ఉదాహరణకు పెళ్ళికి ముందు అమ్మాయి, అబ్బాయి హాయిగా మాట్లాడుకునే అవకాశం వుంది. కాబోయే భాగస్వామి తో ఒక్కళ్ళ గురించి ఒక్కళ్ళ గురించి ఒక్కళ్ళు తెలుసుకునే ప్రయత్నం హాయిగా చేయొచ్చు. అభిరుచులు, అభిప్రాయాలు స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఇద్దరు ఉద్యోగులైతే ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటాయో, జీవితం ఎలా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటుంన్నారో, పిల్లల్ని ఎలా ఎంచాలనుకుంటుంన్నారో, ఈ ప్రయాణం వాళ్ళకి సాయం వుండే వాల్లెవ్వరో కుడా మాటలడుకోవచ్చు. ఒక స్పష్టమైన అవగాహన తో వెళ్లి పీటలపైకి వెళితే ఆ జీవితం నందన వనం కదా. ఒక వేళ చిన్ని చిన్ని అభిప్రాయ భేదాలు తెలిసినా వాటిని ఎలా సర్దుకు పోవోచ్చో, ఎలా సర్దుబాటు చేసుకోవచ్చో ముందే తెలిసి వుంటుంది గనుక ఆ నివాసం సూటిగా నూటికి నూరేళ్ళు విజయవంతంగా ఆడుతూ, పాడుతూ సాగుతుంది. అండర్ స్టాండింగ్ వున్న భార్యా భర్తలు పిల్లల్ని చక్కగా పెంచుకుని వాళ్ళ భవిష్యత్తుని, తమ భవిష్యత్తుని తీర్చిదిద్ద గలుగుతారు.