త్రీడీ డిజైన్ వాల్ పేపర్ల లలో ఇల్లే హాయి నిచ్చే ప్రకృతిలా అయిపోతుంది. లివింగ్ రూమ్ గోడలకు పెద్ద ఫ్లోరల్ డిజైన్లు సముద్రతీర ప్రకృతి దృశ్యాలు ఉంటే చాలు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. త్రీడీ డిజైన్స్ గోడలకు తగిన వర్ణాలలో ఎంచుకోవాలి. పిల్లల గదుల్లో ఆకాశం, నక్షత్రాలు, సముద్రం, చేపలు త్రీడీ వాల్ పేపర్స్ అంటిస్తే అది మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. బెడ్ రూమ్ లో అయితే చల్లని చంద్రుడు, నక్షత్రాలు వాల్ పేపర్స్ తో ప్రతి రాత్రి వెన్నెల వర్షం కురుస్తుంది. పెద్దగా ఫర్నిచర్ ఇతర అలంకరణ లు  లేకపోయినా గోడలపైన ఈ వాల్ పేపర్స్ ఒక కొత్త లోకాన్ని సృష్టించి ఇస్తాయి.

Leave a comment