స్కిన్ వైటనింగ్ క్రీములకు కొదవలేదు అయితే వాటివల్ల చర్మం పాడయ్యి పోకుండా తెల్లబడతామో లేదా అన్నదే ప్రశ్న. అయితే పెద్ద ఖర్చు పెట్టకుండా రాత్రికి రాత్రే మెరిసిపోయే మేనిచాయ ఇచ్చే హోమ్ టిప్స్ ఎన్నో వున్నాయి. రాత్రి వేళ ఒక పూత పూస్తే తెల్లారికే మెరిసిపోవచ్చన్నమాట. బాగా పండిన అరటి పండు గుజ్జు లో రోజ్ వాటర్ కలిపి నిద్ర పోయే ముందర ముఖానికి పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖానికి తక్షణ మెరుపు ఇవ్వడం ఖాయం. అలాగే దోసకాయ గుజ్జు, పెరుగు కలిపి పూత వేసినా తెల్లారె సరికే మెరుస్తు చర్మం కనిపిస్తుంది. అలాగే నిమ్మరసం, తేనె, పసుపు, ఆలివ్ ఆయిల్, పాలపొడి, ఆల్మండ్ ఆయిల్, స్ట్రాబెర్రీ, గ్రీన్ టీ ఈ కాంబినేషన్ లో ఏవైనా సరే ముఖానికి మెరుపు ఇచ్చేవే. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వుండే ఈ ప్యాక్స్ నిరభ్యంతరంగా ట్రై చేయొచ్చు.
Categories