ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా డీహైడ్రేషన్ వల్ల  రక్త నాళాలు వ్యాకోచం చెంది నీరు చేరుతుంది. నీరు బాగా తాగకపోతే మొహం ఉబ్బరిస్తుంది. అలాగే శరీరంలో అధిక శాతం ఉప్పుచేరినా ముఖం వస్తుంది. కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్ తాగినా ప్యాకేజీ ఫుడ్స్ తో సోడియం శరీరంలో చేరినా ఈ ప్రాబ్లమ్ కావచ్చు . ఇలా ముఖం ఉబ్బరించుకోకుండా ఉండాలంటే డైట్ లో ఎక్కువ పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి . బొప్పాయిపండు తింటే పొట్ట చిన్న ప్రేవుల ఆరోగ్యం సరిగా ఉంటుంది . ముఖంలో ఉబ్బరింపు ఉండదు విటమిన్ సి బీటాకెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు తినాలి. ఇవి చర్మం లో నీళ్లు నిలిచిపోకుండా సహాయపడతాయి. చర్మం మెరిసిపోతుంది. మొహం తేజోవంతంగా ఉంటుంది.

Leave a comment