Categories

జుట్టు చక్కగా మెరుపుతో జీవంతో వుండాలంటే వారానికి ఒక సారి హాట్ ఆయిల్ ధెరఫీ చేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ముందుగా చక్కగా జుట్టు దువవి పాయలుగా తీసి నువ్వుల నూనె ఆలివ్ నూనె ఈ రెంటిలో ఒక దాన్ని వేడి చేసి అప్లయ్ చేయాలి. జుట్టు డ్రై గా వుంటే స్వచ్చమైన కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ రాయాలి. మాడు మృదువుగా మసాజ్ చేసి చిన్ని చిన్ని రొటేటింగ్ ముమెంట్స్ ఇస్తుండాలి. తర్వాత వేడి టవల్ తలకు చుట్టుకోవాలి. క్రీమీ హెయిర్ కండీషనర్ లో కొద్దిగాఏళ్ళు కలిపి స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు పై స్ప్రే చేసి దువ్వెనతో దువ్వితే జుట్టు సమంగా చక్కగా వస్తుంది. ఇలాంటి గృహ చికిత్సల వల్లే జుట్టు పోషణ చక్కగా జరుగుతుంది.